News May 13, 2024

సిరా చుక్క తయారయ్యేది మన HYDలోనే..!  

image

ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వేలికి పెట్టుకునే సిరాని 1990 నుంచి HYDలోనూ తయారు చేయటం ప్రారంభించారు. ఉప్పల్‎లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. సుమారు 100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది. దాదాపు 100 దేశాలకు ఈ సిరాను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Similar News

News October 8, 2024

రైల్వేలో JOBS.. సికింద్రాబాద్‌‌లో 478 పోస్టులు

image

దేశవ్యాప్తంగా 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేయాలనుకునేవారికి అప్లై చేసేందుకు మరో 5 రోజులే గడువు ఉంది. అక్టోబర్‌ 13వ తేదీన అప్లికేషన్‌ గడువు ముగియనుంది. కేవలం మన సికింద్రాబాద్‌(SCR) రీజియన్‌లోనే 478 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్, హిందీ టైపింగ్, కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు.
SHARE IT

News October 8, 2024

BREAKING: HYD: నిద్రిస్తున్న భార్య.. దారుణ హత్య!

image

HYD హైదర్షాకోట్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి భర్త శ్రీనివాస్ హత్య చేశాడు. గతకొంత కాలంగా టార్చర్ చేస్తున్నాడని గతంలోనే మృతురాలు పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో భార్యను చంపేసిన శ్రీనివాస్ పిల్లలతో సహా PSకి వెళ్లి లొంగిపోయాడు. స్పాట్‌కి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 8, 2024

దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

image

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.