News September 27, 2024
సిరిమాను వృక్షాలు తరలించేందుకు సిద్ధమవుతున్న ఎడ్ల బండి

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈనెల 28న పెదతాడివాడ గ్రామం నుంచి సిరిమాను వృక్షాన్ని తరలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుకుంపేట వద్ద సిరిమాను వృక్షాన్ని తరలించేందుకు వడ్రంగులు ఎడ్ల బండిని తయారు చేస్తున్నారు. ఈ ఎడ్ల బండి పైన సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను భారీ ఊరేగింపు నడుమ దేవస్థానం వద్దకు తరలించిన అనంతరం సిరిమానుగా మలుస్తారు.
Similar News
News February 12, 2026
విజయనగరం: పెట్రోలో కావలంటే..హెల్మెట్ ధరించాల్సిందే!

రహదారి భద్రతా నియమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు త్వరలో “నో హెల్మెట్ – నో పెట్రోల్ “ అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన వాహన తనిఖీలను పరిశీలించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేశారు.
News February 12, 2026
రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని సమీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.