News October 3, 2025
సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901758>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.
Similar News
News October 3, 2025
చినరావూరులో తీవ్ర విషాదం

నల్గొండ (D) దేవరపల్లి దిండి కాలువలో గురువారం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చినరావూరుకు చెందిన కేతావత్ రాము నాయక్ (34) కూడా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్ ను రక్షించే క్రమంలో మృతి చెందాడు. సాయంత్రానికి రాము మృతదేహం తెనాలి రానుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News October 3, 2025
నర్సంపేట ఘటనపై విచారణ కొనసాగుతోంది: వరంగల్ సీపీ

నర్సంపేటలో గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. గురువారం సాయంత్రం నర్సంపేట వెంకటేశ్వరస్వామి గుడి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
News October 3, 2025
ఖమ్మం: కలిసొచ్చిన రిజర్వేషన్.. మళ్లీ ఆమే సర్పంచ్..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు కొంతమందిని నిరాశ కలిగిస్తే మరికొంతమందికి కలిసొచ్చాయి. పెనుబల్లి మండలం గౌరవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క కుటుంబం మాత్రమే ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలోని మహిళ రుద్రజారాణి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ అదే రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ పదవి ఆమెకే దక్కనుంది.