News October 3, 2025
సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.
Similar News
News October 3, 2025
వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్‌ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
News October 3, 2025
సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జీఎస్టీకి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సీటీవో ఏలూరు సర్కిల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సిటీవో చిట్టిబాబు తెలిపారు. జీఎస్టీ వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రజలు సీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 8096082086కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చునని తెలిపారు. నేరుగా కార్యాలయాన్ని కూడా సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు.
News October 3, 2025
మద్రాస్ హైకోర్టులో TVK పార్టీకి చుక్కెదురు

కరూర్ (TN) తొక్కిసలాటపై TVK పార్టీకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కేసును CBIకి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ప్రజలకు నీళ్లు, ఆహారం కల్పించకుండా సభ ఎలా నిర్వహించారని నిలదీసింది. రోడ్డు మధ్యలో సభకు ఎందుకు అనుమతించారని పోలీసులను ప్రశ్నించింది. బాధితులకు పరిహారం పెంపుపై 2వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.