News October 4, 2025

సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.

Similar News

News October 4, 2025

SKLM: ‘27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి’

image

వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 350 విద్యుత్ మీటర్ల వైర్లు తెగిపడ్డాయని, 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయని చెప్పారు. సుమారు రూ.20 లక్షలతో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. 600 మంది సిబ్బందిని 300 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించామన్నారు.

News October 4, 2025

విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

image

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901456>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళ్తుండగా వద్దని అమ్మ వారించారు. పంతం మీద యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విని పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేశారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తికి కలలో కనిపించి చెరువులో ప్రతిమగా వెలిసినట్లు చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా మారింది.

News October 4, 2025

శ్రీకాకుళంలో అక్టోబర్ 8-14వరకు ఆధార్ క్యాంపులు

image

అక్టోబర్ 8 నుంచి 14 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరిండెండెంట్ హరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆముదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి సబ్ పోస్ట్ ఆఫీస్, CR పురం, రాజాం, కొత్తూరు, పొందూరు, కోటబొమ్మాళి, హిరమండలం, కాశీబుగ్గ పాతపట్నం ప్రాంతాల్లో సేవలు అందించడం జరుగుతుందన్నారు. 5 నుంచి15 సంవత్సరాల పిల్లలు వినియోగించుకోవాలన్నారు.