News December 14, 2025

సిరిసిల్లలో రేపు కేటీఆర్ పర్యటన

image

సిరిసిల్ల నియోజకవర్గంలో రేపు సోమవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో ఉదయం 11.00 గంటలకు మొదటి విడుతలో వేములవాడ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నూతన సర్పంచ్‌లు, రెండవ విడతలో గెలిచిన తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినిపల్లి మండలాల సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

Similar News

News December 16, 2025

సంగారెడ్డి: 3వ విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

3వ విడతలో కల్హేర్, కంగ్టి, మనూర్, నాగలిగిద్ద, NKD, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 16, 2025

VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.

News December 16, 2025

ADB: సోషల్‌ మీడియాపై నిఘా: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.