News February 23, 2025

సిరిసిల్లలో రేపు ప్రజావాణి రద్దు

image

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా అధికారులంతా బిజీగా ఉండటంతో ప్రజావాణి రద్దు చేశామన్నారు.

Similar News

News February 23, 2025

మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

image

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 23, 2025

6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.

News February 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

error: Content is protected !!