News November 27, 2025

సిరిసిల్లలో సర్పంచుల ‘ఏకగ్రీవాల పర్వం’..!

image

సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండా సర్పంచ్‌గా జవహర్‌లాల్ నాయక్‌ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అదే మండలంలోని ‘సర్పంచ్ తండా’కు సర్పంచ్(నరహరి నాయక్‌), ఉప సర్పంచ్(గంగారాం నాయక్‌)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఈ రెండు తండాల్లో తొలి విడత అయిన DEC 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏకగ్రీవం కావడంతో ఇక ఇక్కడ ఎన్నికలు లేనట్లే.

Similar News

News November 27, 2025

NRPT: ఎన్నికల సమాచారం కోసం ‘Te-Poll’ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని ఓటర్లకు అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.

News November 27, 2025

ఉమ్మడి చిత్తురు జిల్లాకు మరోసారి భారీ వర్ష సూచన.!

image

ఉమ్మడి చిత్తురు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం చిత్తురు, తిరుపతి జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News November 27, 2025

భూపాలపల్లి: హత్యాయత్నం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

image

మద్యం మత్తులో భార్యను, కొడుకును చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో దాడి చేసి గాయపర్చిన వ్యక్తిపై నేరం రుజువైనందున భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి A.నాగరాజు నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చారు. భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మార్త రాజేశ్ ఈ నేరం చేశాడని, అతడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకీర్త్ అభినందించారు.