News December 21, 2025
సిరిసిల్లలో 17,724 కేసులు పరిష్కారం

సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు లోక్ అదాలత్‌లో 17,724 కేసులను పరిష్కరించామని సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్ 16, క్రిమినల్ 398, ఎక్సైజ్ 33, చెక్ బౌన్స్ 11, కుటుంబ తగాదాలు 01, గృహ హింస 6, భూ సేకరణ కేసులు 2, బ్యాంకు కేసులు 9, డ్రంక్ అండ్ డ్రైవ్ 1725, ట్రాఫిక్ చలానాలు 15,508, పెట్టి కేసులు 12 పరిష్కరించామన్నారు.
Similar News
News December 26, 2025
కలెక్టర్, ఎస్పీతో సమావేశమైన బాపట్ల ఎంపీ

లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఎంపీ సుధీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
News December 26, 2025
జగన్ బెదిరింపులకు భయపడే వారు లేరు: మంత్రి సవిత

పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ బెదిరించడంపై మంత్రి సవిత మండిపడ్డారు. శుక్రవారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. దౌర్జన్యాలతో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జగన్ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


