News February 11, 2026
సిరిసిల్లలో 77.56% పోలింగ్ నమోదు

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో 81959 మంది ఓటర్లకు గాను 63566 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 30482 మంది పురుషులు, 33709 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటేశారు. దీంతో 77.56% ఓటింగ్ నమోదు అయింది. ఎన్నికలు ముగిసే సమయానికి 39వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల నడుమ ఘర్షణ జరుగగా, మిగత అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Similar News
News February 12, 2026
MDK: యాక్సిడెంట్‌లో తల్లి మృతి.. కొడుకు, కోడలికి గాయాలు

శివంపేట మం. గోమారం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో బిజిలిపూర్‌కు చెందిన జుబేదా(55) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆమె కొడుకు, కోడలిని మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలో ఓ ఆస్పత్రికి తరలించారు. బైక్ మెకానిక్ సాదక్.. భార్య అజీరా, తల్లి జుబేదాతో కలిసి గోమారం వైపు వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు శివంపేట పోలీసులు తెలిపారు.
News February 12, 2026
పొంగులేటి vs కూనంనేని.. గెలుపెవరిది?

గత అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ.. కొత్తగూడెం కార్పొరేషన్ బరిలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి పొంగులేటి, సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే కూనంనేని గట్టి ప్రచారం నిర్వహించారు. ఇద్దరు అగ్రనేతలు తమ అభ్యర్థుల కోసం శ్రమించడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరిలో నెగ్గేదెవరో రేపటి ఫలితాల్లో తేలనుంది.
News February 12, 2026
SKLM : మహిళపై దాడి.. ఒకరిపై కేసు

కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామానికి చెందిన కాళ్ల సింహాద్రమ్మ తనపై దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన దేవాది అప్పలమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగునీటి కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.


