News April 10, 2025

సిరిసిల్ల: అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన పండ నేల పాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Similar News

News September 17, 2025

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మోడల్స్ ప్రదర్శన

image

విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు జరిగే 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (AGC) యొక్క సూక్ష్మ నమూనాలను APCRDA ప్రదర్శించనుంది. ప్రజలు భవిష్యత్తులో నిర్మించబోయే ఈ కాంప్లెక్స్‌ను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందేందుకు వీలుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.

News September 17, 2025

అమరావతి మినియేచర్ మోడల్స్ సందర్శించే అవకాశం

image

రాజధానిలో నిర్మించే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) సూక్ష్మ నమూనాలను(మినియేచర్ మోడల్స్) ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌లో వీటిని ప్రదర్శిస్తామని CRDA కమిషనర్ కార్యాలయం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు, HOD టవర్స్ మినియేచర్ మోడల్స్ ఈ కార్యక్రమంలో ప్రజలు సందర్శించవచ్చని CRDA పేర్కొంది.

News September 17, 2025

కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు

image

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.