News October 22, 2025

సిరిసిల్ల అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె ప్రస్తుతం సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ఆమెను నియమించారు.

Similar News

News October 24, 2025

జూబ్లీ బైపోల్: మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి!

image

జూబ్లీ బైపోల్‌ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకునేలా ECI అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ECINET మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘Know Your Candidate’ మాడ్యూల్‌ ద్వారా ఓటర్లు.. పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసులు వంటి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఓటర్లు Android, iOSలో ECINET యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT

News October 24, 2025

మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

image

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News October 24, 2025

బొమ్మల కొలువులో సచివాలయం, బిర్లా మందిర్

image

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కొలువుదీరేలా బొమ్మల కొలువు రూపొందించి అందులో తెలంగాణ సచివాలయ భవనం, బిర్లా మందిర్ నమూనాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో నివసించే విజయ్ కుమార్ ఏటా ఇలా వినూత్నంగా కొత్త డిజైన్లతో బొమ్మలతో రూపొందిస్తుంటారు. అత్యంత ఆకర్షణంగా ఉన్న ఈ బొమ్మలను చూడటానికి వచ్చిన ప్రజలు విజయకుమార్ కళను అభినందిస్తున్నారు.