News February 22, 2025
సిరిసిల్ల: అధికారులకు ధన్యవాదాలు

సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన భూకబ్జాపై అధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్నందుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామ సమీపంలో గల మైసమ్మ చెరువులో 199 సర్వే నంబర్‌లో 8 ఎకరాల భూమిని ఆగయ్య కొనుగోలు చేసి అదనంగా ఎకరం భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు.
Similar News
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.
News November 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 06, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 6, 2025
జగిత్యాల: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం..!

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు మగబాబు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


