News August 14, 2025

సిరిసిల్ల: ‘అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం’

image

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News August 16, 2025

కృష్ణా: నీట మునిగిన పంటలు.. నష్ట పరిహారం ఇస్తారా..?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 6-7 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో పులిపాక-అవనిగడ్డ మార్గంలో అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయల పంటలు, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, చందర్లపాడు ప్రాంతాల్లో వరి, పత్తి పైరు కొంతమేర దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నీరు బయటకు పోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వ సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు

News August 16, 2025

కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేయాలంటే?

image

త్వరగా లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్నికృష్ణుడి విగ్రహం/చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. కన్నయ్యకు ఆహ్వానం పలుకుతూ వరిపిండితో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. వెన్న, అటుకులు, కలకండ, నెయ్యితో చేసిన లడ్డూలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News August 16, 2025

రూ.100 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్: సత్యకుమార్

image

AP: విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. నెల రోజుల్లో తిరుమల, విశాఖలో టెస్టింగ్ ప్రారంభిస్తామన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.