News March 8, 2025

సిరిసిల్ల: అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని ప్రజలు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ గడువులోగా తమ ప్లాటు రెగ్యులరైజ్ కోసం సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News November 8, 2025

శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించింది ఎర్ర చందనం: DCM పవన్

image

ఎర్ర చందనం చాలా అపురమమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాయం తగిలి, గాయం వల్ల చిందిన రక్తంతో ఎర్రచందనం పుట్టినట్లు శాస్త్రం చెబుతోందన్నారు. ఏపీలోని స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలిపివేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 8, 2025

కీరాతో ఎన్నో లాభాలు

image

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.

News November 8, 2025

పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

image

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.