News January 2, 2026
సిరిసిల్ల: ఆత్మరక్షణ విద్య శిక్షకుల దరఖాస్తుల ఆహ్వానం

ఆత్మ రక్షణ విద్య శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థినులకు ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంగ్ఫూ, జూడో తదితర ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన శిక్షకులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈనెల ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 25, 2026
విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్‌లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్‌లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.
News January 25, 2026
సింగరేణి సమ్మక్క జాతరకు 30 ఏళ్ల చరిత్ర

గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి నది వంతెన వద్ద వెలసిన సమ్మక్క జాతరకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో జాతర సమయంలో కార్మికులు మేడారం వెళ్లడం వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగేది. దీనిని గమనించిన సింగరేణి యాజమాన్యం 1992లో స్థానికంగానే జాతరకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి కార్మిక కుటుంబాల కోసం ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
News January 25, 2026
కృష్ణా: మూడు ఫ్లైఓవర్లు పట్టాలెక్కేనా?

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రతిపాదించిన 3 కీలక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది. రాజీవ్ గాంధీ పార్క్-బెంజ్ సర్కిల్, బెంజ్ సర్కిల్-గోశాల, మహానాడు-నిడమానూరు మార్గాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నా, అడ్డంకులు ఎదురవుతున్నాయి. NHAI నిబంధనల ప్రకారం CM కార్యాలయం నుంచి ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉండగా, ఇప్పటివరకు ముందడుగు పడలేదు.


