News March 29, 2024
సిరిసిల్ల: ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయండి: కలెక్టర్

ఎటువంటి ఆధారాలు లేకుండా రూ.50,000 మించి నగదు తరలిస్తే సీజ్ చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం వాహనాల ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాలని అధికారులు ఆయన ఆదేశించారు.
Similar News
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్‌లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News February 18, 2026
కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.