News February 1, 2025
సిరిసిల్ల: ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతం: ఎస్పీ

సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 11 విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మైనర్‌లతో పని చేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 31 మంది మైనర్ పిల్లలను కాపాడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు.
Similar News
News January 29, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు నంద్యాల కలెక్టర్ కీలక సూచన

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు అర్జీలు స్వీకరించి, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలన్నారు.
News January 29, 2026
NRPT: కంట్రోల్ రూమ్ నంబర్ ఇదే..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా నారాయణపేట కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154283913 కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
News January 29, 2026
గీతం భూముల క్రమబద్ధీకరణపై YSRCP నిరసన

గీతం విద్యాసంస్థల పరిధిలోని రూ.5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని YSRCP భారీ నిరసన చేపట్టింది. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నేతలు గీతం వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ కుట్రను అడ్డుకుంటామని పేడాడ రమణికుమారి, కే.కే.రాజు, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి తదితర ముఖ్యనేతలు స్పష్టం చేశారు.


