News November 7, 2025

సిరిసిల్ల: ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ సిద్ధం: కలెక్టర్

image

రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ (యూనిఫామ్స్) సిద్ధమవుతున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే ఈ చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం హాజరయ్యారు.

Similar News

News November 7, 2025

HYD మెట్రో ఛార్జీల పెంపు.. అదంతా FAKE

image

HYD మెట్రో రైలు ఛార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై IPR అసిస్టెంట్ డైరెక్టర్ జాకబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ఛార్జీల సవరణ లేదని తెలిపారు. మెట్రో రైల్వేస్ (O&M) చట్టం- 2002 ప్రకారం, ఛార్జీలు నిర్ణయించే బాధ్యత మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ (MRA)కి ఉంటుంది. ఈ నిర్ణయం FFC సిఫార్సుల ఆధారంగా మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ఛార్జీల పెంపు వార్తలు నిరాధారమన్నారు.

News November 7, 2025

ASF: ‘సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

image

ASF డివిజన్‌లోని సిబ్బందికి అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ASF డివిజన్ లోని ఐసిడిఎస్, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ రీ-ఓరియంటేషన్ శిక్షణ తరగతులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంలతో కలిసి హాజరయ్యారు.

News November 7, 2025

యాదగిరిగుట్ట ఈవోగా వెంకట్రావుకు బాధ్యతలు

image

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా వెంకట్రావు ఈరోజు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 43 రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆలయం, క్యూలైన్లు, మాడవీధులు, శివాలయం, పుష్కరిణి, ప్రసాద విక్రయాల విభాగాలు సహా అన్ని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.