News January 25, 2025
సిరిసిల్ల: ఇద్దరు మాజీ నక్సలైట్లు అరెస్టు

సిరిసిల్ల సిటీకి చెందిన ఇద్దరు మాజీ నక్సలైట్లతో పాటు మరొక వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. పట్టణానికి చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, రమేష్, సందీప్ పెద్దూర్ శివారులో వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని తిరిగి మాకే ఇవ్వాలని బెదిరించిన మాజీ నక్సలైట్లులక్ష్మణ్, ప్రసాద్ అలాగే మరోవ్యక్తి రాజుపై కేసు నమోదుచేసి అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.
Similar News
News January 3, 2026
సిరిసిల్ల: 76 మంది చుక్కేసి.. చిక్కారు..!

నూతన సంవత్సర సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. అన్ని పోలీసుల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. 76 మంది మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసులు నమోదు చేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్టేషన్‌కు తరలించారని వెల్లడించారు.
News January 3, 2026
6న పార్వతీపురంలో జాబ్ మేళా.. 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు

పార్వతీపురం ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 6న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి R.వహీదా శుక్రవారం తెలిపారు. మొత్తం 9 కంపెనీల్లో 561 ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు కలిగి పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు. ఆసక్తిగల, అర్హతలున్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 3, 2026
మంచిర్యాల: ఆ మున్సిపాలిటీకి ఎన్నికలెప్పుడు..?

మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 3 దశాబ్దాలవుతున్నా నేటికీ ఎన్నికలు జరగకపోవడం గమనార్హం. 1995లో మున్సిపాలిటీ ఏర్పడినా రిజర్వేషన్ల వివాదంతో 1998లో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటి నుంచి త్రిసభ్య కమిటీ పాలనలోనే కాలం వెళ్లదీస్తోంది. ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి.


