News January 8, 2026

సిరిసిల్ల: ‘ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి’

image

ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యూరియా పంపిణీ ఇతర అంశాల పరిశ్రమలకు జిల్లా, మండల టాస్క్ఫోర్స్ టీంను గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కొరతలేదని, పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.

Similar News

News February 6, 2026

శుక్ర జపం ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటి?

image

శుక్ర జపాన్ని ప్రశాంత ప్రదేశంలో చేయాలి. వీలైతే తెల్లని దుస్తులు ధరించాలి. ఇందుకు ఉదయం/సాయంత్రం వేళలు అనుకూలం. కళ్లు మూసుకుని మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. 108 పూసల జపమాల ఉంటే దాని సాయంతో వాటిని లెక్కిస్తూ జపించాలి. ఈ సాధనతో అంతర్గత మార్పు మొదలవుతుంది. క్రమంగా నిర్ణయాలు మెరుగుపడతాయి. బంధాలు బలపడతాయి. ఈ ప్రక్రియ మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బయట ప్రపంచపు ఆనందాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.

News February 6, 2026

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశం: ట్రంప్

image

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.

News February 6, 2026

అలిపిరి: 2నంబర్ ప్లేట్లతో ప్రయాణం

image

అలిపిరి టోల్‌గేట్ వద్ద రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 18 సీటింగ్ కెపాసిటీ వాహనాల్లో సీట్లు తొలగించి తిరుమలకు భక్తులను తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. TTD నిబంధనల ప్రకారం 13సీట్లకు మించి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ట్యాక్స్ చెల్లించని రెండు టెంపో వాహనాలపై కేసులు నమోదు చేశారు. రెండు నంబర్ ప్లేట్‌తో నడుస్తున్న జీపును గుర్తించి సీజ్ చేశారు.