News April 19, 2025

సిరిసిల్ల: ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి

image

యాసంగి పంట కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే పంట కొనుగోలు సజావుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు.

Similar News

News April 20, 2025

నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

image

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.

News April 20, 2025

AMP: జిల్లాలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు

image

కోనసీమ జిల్లాలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నామని డీఈవో షేక్ సలీం భాష తెలిపారు. ఆయన అమలాపురం నుంచి శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆసక్తి కలిగిన వారు 26వ తేదీలోపు వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 20, 2025

చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

error: Content is protected !!