News April 8, 2025
సిరిసిల్ల: ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి: కలెక్టర్

రేపటి నుంచి పదిర, కొండాపూర్ ఇసుక రీచులను ప్రారంభించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఇసుక రీచ్‌లపై ఏర్పాటుపై అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇల్లు, పెండింగ్ డబల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి ఎక్కడ కూడా ఇసుక కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News April 8, 2025
గోల్డ్ రేట్ టుడే!

USA విధించిన సుంకాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹650 తగ్గి ₹89,730కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹600 తగ్గి ₹82,250గా పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,03,000గా ఉంది. కాగా, గత 5 రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,650 తగ్గడం విశేషం.
News April 8, 2025
అనకాపల్లి జిల్లాలో ‘గుండె’లు పిండేసిన ఘటన

బుచ్చయ్యపేట(M)బంగారుమెట్టులో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో సోమవారం మరణించారు. మేరుగు శ్రీను(28) పెయింటింగ్ పనికి అరకు వెళ్లాడు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే మరణించాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న నక్కా లక్ష్మీనారాయణ(48) మధువాడ ఐటీ హిల్స్ వద్ద గుండెపోటుతో రోడ్డుపైనే కుప్పకూలి మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News April 8, 2025
వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటితో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. నేడు రూ.7,355 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ. 50 ధర తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. ఎండాకాలం నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటిస్తూ మార్కెట్‌కు సరకులు తీసుకొని రావాలని సూచిస్తున్నారు.