News December 11, 2024
సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12 నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
హుజురాబాద్‌లో 81.47% పోలింగ్ నమోదు

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.
News February 11, 2026
కరీంనగర్: ‘అభ్యర్థి సస్పెన్షన్ వార్తల్లో నిజం లేదు’

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.
News February 11, 2026
హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.


