News October 24, 2025

సిరిసిల్ల: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్, ఒకేషనల్, ప్రొఫెషనల్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News October 24, 2025

జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

జమ్మూలోని ఎయిమ్స్‌లో 80 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతలుగల అభ్యర్థులు అప్లై చేసుకుని హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/

News October 24, 2025

ఓయూలో UPSC ప్రిలిమ్స్‌ శిక్షణ FREE

image

OUలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో UPSC ప్రిలిమ్స్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ డా.నాగేశ్వర్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ UPSC ప్రిలిమ్స్‌తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కళాశాలల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డా.నాగేశ్వర్ సూచించారు.
SHARE IT

News October 24, 2025

శ్రీరామ నామ పఠనంతో విజయం తథ్యం

image

శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఆ స్వామి నామము, రూపము, గుణములు, లీలలు అన్నీ అద్భుతాలే. ఆ పరమాత్ముని వచనములు ఆదర్శ ప్రాయములు. వాటిని శ్రవణం, పఠనం, మననం చేయుట మనకు శ్రేయస్సు చేకూరుస్తుంది. ఎల్లప్పుడూ ఆ ప్రభువు రూపాన్ని, గుణాలను మనస్సులో నిలుపుకొని, ఆయన ఆదర్శములను ఆచరించిన పుణ్యాత్ములకు విజయం తథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి సద్భాగ్యము కలిగిన మానవుడు నిజంగానే ధన్యుడు. <<-se>>#Bakthi<<>>