News March 13, 2025
సిరిసిల్ల: ఉపాధ్యక్షురాలుగా లావణ్య లింగారెడ్డి

సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా తంగళ్ళపల్లికి చెందిన ఆసాని లావణ్య లింగారెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో లావణ్య లింగారెడ్డికి ఆమె గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 14, 2026
16 నుంచి విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విశాఖలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నెల 16న రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకొని బస చేస్తారు. 17న సాయంత్రం విశాఖ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 18న ఐఎఫ్ఆర్‌లో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలుకి 20న విజయవాడ బయలుదేరుతారు.
News February 14, 2026
విమానంలో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసి..

అస్సాం నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసిన పేపర్ వాష్‌రూమ్‌లో లభించింది. సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేయడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న షిల్లాంగ్ నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో విమానానికీ బాంబ్ బెదిరింపు వచ్చింది.
News February 14, 2026
ఘనంగా భాష్యం బ్లూమ్స్ వార్షికోత్సవ వేడుకలు

గోరంట్ల భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్లో ‘బ్లూమ్స్ బ్లూమ్రాంగ్’ వార్షికోత్సవం జరిగింది. మార్కులు మాత్రమే కాదు, నైపుణ్యాల ఆధారిత విద్య అవసరమని ముఖ్యఅతిథి డా.లలిత్ అన్నారు. విద్యార్థులు విలువలతో ఎదగాలని జిల్లా జడ్జి ఎం.ఇందిర ప్రియదర్శిని.., భాష్యం అందించిన విలువలే తన విజయానికి కారణమని పూర్వవిద్యార్థి డా.ఘంటా చైతన్య అన్నారు. ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ ఛైర్మన్ హనుమంతరావు, ఎండీ సాకేత్ రామ్ పాల్గొన్నారు.


