News April 9, 2024

సిరిసిల్ల: ఎంట్రెన్స్ రాయకున్నా పాలిటెక్నిక్‌లో ఉచిత సీటు

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ HYDలో ప్రవేశానికై తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాయకున్నా కేవలం 10వ తరగతి చదివిన అర్హులన్నారు. ఆసక్తి గలవారు మే15లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. దరఖాస్తు ఫారాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News December 14, 2025

లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్‌గా నీలం చంద్రారెడ్డి గెలుపు

image

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.

News December 14, 2025

రామకృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామ కృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ పర్సంటేజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ జిల్లా అధికారులు, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.