News March 20, 2024
సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారులు, పోలీస్ అధికారులతో అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల రోడ్లను తనిఖీ చేయాలని, మాక్‌పోల్, రిజర్వు ఈవీఎం నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News February 7, 2026
KNR: సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలని సూచించారు. గర్భిణులకు ఉచిత పరీక్షలు, మందులపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు టీకాల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 7, 2026
KNR: SRR ప్రభుత్వ కళాశాల ప్రవేశాల కరపత్రం ఆవిష్కరణ

SRR ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో రాబోయే విద్యా సంవత్సరం 2026-27 ప్రవేశాల కరపత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె.రామకృష్ణ అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SRR కళాశాల ప్రస్తుత సంవత్సర అడ్మిషన్లలో రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇదేవిధంగా అడ్మిషన్లు రావడానికి అధ్యాపకులు అందరూ కృషి చేయాలన్నారు.
News February 7, 2026
KNR: అభివృద్ధిని అడగని ఓటర్లు..!

ఉమ్మడి KNRజిల్లా మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ వేరు. ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి. వాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలపై అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడం మానేశారు. “ఎవరు ఎంత ఇస్తున్నారు? ఏ పార్టీ మందు పోస్తోంది?” అనే చర్చపైనే ప్రధాన దృష్టి సారించారు. అభ్యర్థులు కూడ కేవలం ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.


