News January 17, 2026
సిరిసిల్ల: ఎన్నికల ఖర్చుపై కార్యదర్శుల్లో ఆందోళన

గత పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్లు ప్రారంభం నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అల్పాహారం, భోజనాలు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కార్యదర్శి రూ.30 వేల పైగా ఖర్చు చేశారు. GPని బట్టి రూ.6-8 వేల వరకు ఖర్చులు అందించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News February 5, 2026
రేగోడ్: టాపర్‌గా నిలవండి.. రూ.5 లక్షలు గెలవండి!

రేగోడు, లింగంపల్లి, గజవాడ పాఠశాలల్లో ఓ సంస్థ ఆధ్వర్యంలో ‘చదువుకో తెలంగాణ’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెన్త్ వార్షిక పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తారని MEO గురునాథ్ తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి అందిస్తున్న సాయం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 5, 2026
ఘోరం.. 162 మందిని కాల్చిచంపారు

నైజీరియాలో మిలిటెంట్ దళాలు రెచ్చిపోయాయి. క్వారాలోని రెండు గ్రామాల్లో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 162 మంది మరణించారు. ఈ మధ్య కాలంలో ఇవే అత్యంత ఘోరమైన దాడులని స్థానిక నేతలు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో అనుబంధంగా ఉన్న లకురావా ఈ ఘాతుకానికి తెగబడిందన్నారు. మిలిటరీ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా సాయుధమూకలు ఈ దాడులకు పాల్పడుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతాలు కావడంతో చేరుకోవడం కష్టంగా మారిందన్నారు.
News February 5, 2026
బెల్లంపల్లి: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

బెల్లంపల్లిలోని కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ముష్కే వెంకటేశ్ (45) కానిస్టేబుల్ గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్ హైదరాబాదులో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంకటేశ్ బెల్లంపల్లి తాళ్ల గురజాల PSలో కోర్ట్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ప్రస్తుతం మాదారం PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో వారిఇంట విషాదం నెలకొంది.


