News December 15, 2025

సిరిసిల్ల: ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా ఉంచి 98 కేసులలో 1525 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. అలాగే ఎన్నికల ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసి రూ.23,28,500 సీజ్ చేశామని వివరించారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన 782 మందిని బైండోవర్ చేసామన్నారు.

Similar News

News December 19, 2025

SVU: అమ్మాయిలపై ర్యాగింగ్.. ప్రొఫెసర్‌కు మళ్లీ ఉద్యోగం.!

image

SVU సైకాలజీ <<18218622>>HOD<<>> విశ్వానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్లు జూనియర్లను <<18215421>>ర్యాగింగ్<<>> చేసిన ఘటన తెలిసిందే. అప్పట్లో ఈయన్ను ఉన్నాతాధికారులు సస్సెండ్ చేశారు. విచారణ కమిటీ ముందు తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారట. దీంతో విశ్వనాథ్‌పై నిషేధం ఎత్తేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ జరుగుతుండగా సస్పెన్షన్ ఎత్తివేయడం SVUలోనే సాధ్యం అంటూ పలువురు ఎద్దేవా చేశారు.

News December 19, 2025

విశాఖలో పర్యటించనున్న రక్షణ రంగ కమిటీ

image

రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు కొచ్చి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, వారణాసి నగరాల్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని NSTL ప్రతినిధులతో DRDO ప్రాజెక్టుల అప్‌గ్రేడేషన్‌పై, అదేవిధంగా కోస్ట్ గార్డ్ ప్రతినిధులతో తీరప్రాంత భద్రత, రక్షణ సన్నద్ధతపై కమిటీ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు.

News December 19, 2025

ఆరోగ్య శాఖ జీవోలపై విశాఖలో సమీక్ష

image

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు విశాఖలో పర్యటించనుంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన జీవోల అమలును సమీక్షించేందుకు 22న కలెక్టరేట్‌లో, 23న DMHO కార్యాలయం & ఆంధ్రా మెడికల్ కాలేజీలో కమిటీ సమావేశమవుతుంది. అనంతరం స్థానిక ప్రాంతాలను సందర్శించి, 23న రాత్రి తిరుగు ప్రయాణం కానున్నట్లు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర తెలిపారు.