News December 21, 2025

సిరిసిల్ల: ఎన్నికల విజయవంతంపై కలెక్టర్‌కు శుభాకాంక్షలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా జిల్లాలోని ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.

Similar News

News December 24, 2025

ప్రకాశంలో మాతా శిశు మరణాల.. పరిస్థితి ఇదే!

image

ప్రకాశంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది మాతా శిశు మరణాల తగ్గాయని చెప్పవచ్చు. 2019-20లో 16 మాతృ మరణాలు, 359 శిశు మరణాలు, 2020-21లో 19 మాతృ, 263 శిశు, 2021-22లో 20 మాతృ, 403 శిశు, 2022-23లో 5 మాతృ, 201 శిశు, 2023-24లో 8 మాతృ, 196 శిశు, 2024-25లో 5 మాతృ, 177 శిశు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4 మాతృ, 121 శిశు మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మాతా శిశు మరణాల తగ్గుముఖం పట్టాయి.

News December 24, 2025

ఆలయాల్లో ‘వైకుంఠ ఏకాదశి’ ఏర్పాట్లు: TTD

image

AP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీ దృష్ట్యా TTD అనుబంధ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలు సహా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. అమరావతి, VSP, HYD, బెంగళూరు, ఒంటిమిట్ట, నందలూరు, దేవుని కడప, జమ్మలమడుగు, తాళ్లపాక, పిఠాపురం, రాజంపేట తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD పేర్కొంది. 30న తెల్లవారుజాము 1.35 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అవుతాయి.

News December 24, 2025

నటుడిని పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్

image

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్, ఇటాలియన్ యాక్టర్ ఆండ్రియా ప్రెటి వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో 5 రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి విషయాన్ని వీనస్ SMలో వెల్లడించారు. ఈ 45 ఏళ్ల టెన్నిస్ స్టార్ 7సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచారు. గత 16 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆమె JANలో ఆక్లాండ్‌లో జరిగే WTA టూర్ 33వ స్ట్రెయిట్ సీజన్‌లో పాల్గొననున్నారు.