News April 9, 2025
సిరిసిల్ల: ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

మహిళా సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఎరువులు, విత్తనాల డీలర్ షిప్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మహిళా సంఘాలలో అర్హులైన వారిని గుర్తించి వారితో ఎరువులు, విత్తనాల పాస్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Similar News
News April 17, 2025
కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టొచ్చు.. కోర్టు కీలక తీర్పు

అత్తపై కోడలు గృహ హింస కేసు పెట్టొచ్చు. మరి కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న అత్త అలాంటి కేసు పెట్టొచ్చా? ఓ UP మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమవగా జడ్జి కీలక తీర్పునిచ్చారు. ‘కోడలు లేదా కుటుంబసభ్యులెవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు’ అని స్పష్టం చేశారు.
News April 17, 2025
MBNR: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం: ఫైర్ స్టేషన్ ఆఫీసర్

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్‌నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.
News April 17, 2025
రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.