News March 13, 2025
సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.
Similar News
News July 6, 2025
సంగారెడ్డి జిల్లాలో మూడు డెంగ్యూ కేసులు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలోని సోమేశ్వర వాడలో ఒకటి, ఇస్నాపూర్లో ఒకటి, రామచంద్రపురం పరిధిలోని వెలిమెల గ్రామంలో ఒకటి నమోదు అయ్యానని పేర్కొన్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
News July 6, 2025
మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్‌లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.
News July 6, 2025
MHBD: సోమవారం జరిగే ప్రజావాణి రద్దు

సోమవారం(జూలై 7) జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. MHBD, కేసముద్రం మండలాల్లో మంగళవారం ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో పనుల్లో ఉన్నారన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.