News March 29, 2025
సిరిసిల్ల: ఏప్రిల్ నెలలో సదరం క్యాంప్

సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించనున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2, 4, 8, 11 తేదీలలో సదరం క్యాంపు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దివ్యాంగులు మీ దగ్గరలోని మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే సదరం క్యాంపులో పరీక్షలు చేయనున్నట్టు వివరించారు.
Similar News
News February 1, 2026
కొత్త స్కామ్: రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..

సైబర్ కేటుగాళ్లు మరో కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. మీ దగ్గర రూ.5 నోటు చాలా అరుదని, ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ చేసి నమ్మిస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం ముందుగా కొంత డబ్బు పంపాలని సూచిస్తున్నారు. ఇది నమ్మి వారికి డబ్బులు వేయగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో పాటుAPK ఫైళ్లు పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజులు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
News February 1, 2026
మెతుకుసీమపై నిర్మలమ్మ కరుణ చూపేనా..?

నేటి కేంద్ర బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రసాద్ పథకంలో ఏడుపాయల ఆలయానికి చోటు, కూడవెల్లి రామలింగేశ్వరస్వామి టెంపుల్‌కి నిధుల కేటాయింపు, జహీరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలుమార్గం, మెదక్- నర్సాపూర్-HYD 4లైన్ల రోడ్డు ప్రతిపాదనలకు ఆమోదం, నిమ్జ్‌కు నిధులు, సంగారెడ్డి, సిద్దిపేట స్మార్ట్ సిటీలకు ఈసారైనా భారీగా నిధులు కేటాయించాలని ఆశిస్తున్నారు.
News February 1, 2026
323 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు నేటి నుంచి FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనడంతోపాటు కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, CAT ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


