News March 26, 2025
సిరిసిల్ల: ఏప్రిల్ 11లోపు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల బాధితులు ఏప్రిల్ 11 లోపు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర జలాశయం కింద ముంపునకు గురైన బాధితులు అప్లయ్ చేసుకోవాలని సూచించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 3, 2026
ఆదిలాబాద్: పెద్ద పులి దాడిలో లేగ దూడ మృతి

భీంపూర్ మండలం గొల్ల ఘాట్, గుంజాల మధ్య శివారులో పిప్పల కోటి గ్రామానికి కొగురు విట్టల్‌కు చెందిన లేగ దూడ పై మంగళవారం పెద్ద పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అటవీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి ట్రాప్ కెమెరాలను అమర్చినట్లు ఆదిలాబాద్ రేంజ్ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు. పులి దాడిలో మృతి చెందిన లేగ దూడ యజమానికి నష్ట పరిహారం చెల్లిస్తామని, అటు వైపు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు.
News February 3, 2026
ఆక్వా రంగంపై అమెరికా నిర్ణయం స్వాగతిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. దీనివలన నిలిచిపోయిన కొత్త ఆర్డర్లకు మంచి అవకాశం ఉంటుందన్నారు.
News February 3, 2026
వికారాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బోణీ

వికారాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బోణీ కొట్టాయి. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనంతరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15వ వార్డు <<19040568>>బీఆర్ఎస్<<>> అభ్యర్థి విజయలక్ష్మి విజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అయితే అధికార బలంతో కాంగ్రెస్ నాయకులు తమ అభ్యర్థులను బలవంతంగా విత్ డ్రా చేయిస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆరోపించారు. దీంతో వికారాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.


