News March 15, 2025
సిరిసిల్ల: కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమతో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని తెలిపారు.
Similar News
News March 15, 2025
హిందీపై పవన్ కామెంట్స్.. జనసేన శతఘ్ని క్లారిటీ

గతంలో పవన్ హిందీని వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన శతఘ్ని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘పవన్ హిందీని మాత్రమే నేర్చుకోవాలనే నిబంధనను వ్యతిరేకించారు. త్రిభాషా విధానంలో హిందీని కచ్చితంగా అమలు చేయాలనే రూల్ లేదు. NEP-2020 ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు ఏదైనా భారతీయ భాష, విదేశీ భాష నేర్చుకునే సౌలభ్యం ఉంది. రాజకీయాల కోసం హిందీని రుద్దుతున్నారనే ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.
News March 15, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.
News March 15, 2025
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.