News April 3, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

బహుజన ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దురాగతలపై తిరగబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 4, 2025
అనకాపల్లి: కడుపు నొప్పితో యువతి ఆత్మహత్య

కడుపు నొప్పి తాళలేక ఓ యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో యల్లబిల్లి భారతి తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఎంతమంది వైద్యులకు చూపించినా నొప్పి తగ్గడం లేదు. దీంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 4, 2025
కామవరపుకోట: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

కామవరపుకోట మండలం ఉప్పలపాడులో గురువారం గంగాభవానీ అనే వివాహిత కడుపునొప్పి తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలతో కలిసి ఇటీవల భవానీ పుట్టింటికి వచ్చింది. గత కొంతకాలంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గంగాభవాని తండ్రి సూర్యనారాయణ తెలిపారు.
News April 4, 2025
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన నూకరాజు తన భార్యను చంపి కనిపించట్లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.