News September 20, 2025

సిరిసిల్ల కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం?

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రొటోకాల్ విస్మరించడం పట్ల చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్‌తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై రేవంత్ సీరియస్‌గా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.

Similar News

News September 20, 2025

ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

image

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ‌జెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్‌ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News September 20, 2025

అదృష్టం అంటే ఈమెదే!

image

MP మహిళ గోల్డర్‌ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాలో మైనింగ్ చేసే ఆమెకు 8 వజ్రాలు దొరికాయి. వీటిని జిల్లా డైమండ్ ఆఫీస్‌లో జమ చేయగా త్వరలో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వజ్రాల్లో అతిపెద్దది 0.79 క్యారెట్ల బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వజ్రం విలువ రూ.4-6 లక్షలు పలకొచ్చన్నారు. వజ్రాల గనులకు పన్నా జిల్లా ఫేమస్. ఇక్కడ 8మీ. మైనింగ్ ప్లాట్‌ను ఏడాదికి రూ.200 చొప్పున లీజుకు ఇస్తారు.

News September 20, 2025

పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ చేసేలా చర్యలు: బల్దియా కమిషనర్

image

పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ చేసేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బాలసముద్రంలోని పెట్ పార్క్‌తో పాటు మార్కెట్ ప్రాంతంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి సమర్థవంతంగా చేపట్టేందుకు తగిన సూచనలు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో పువ్వులను వినియోగిస్తారని, మిగిలిన పువ్వుల వ్యర్థాలను సేకరించడం కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.