News December 25, 2025
సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ పదవులకు రేపే దరఖాస్తులు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గంలో పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆశావాహులు తమ పేర్లను దరఖాస్తు ఫారం ద్వారా సమర్పించాలని సూచించారు. ఈ నెల 26న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో టీపీసీసీ అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, చైతన్య రెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారని తెలిపారు.
Similar News
News December 27, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
చీరాల వాడరేవులో కలెక్టర్ పర్యటన

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం చీరాల వాడరేవు, కట్టవారిపాలెం ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో చేరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహశీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 27, 2025
ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ

రహదారుల ప్రమాదాల నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం తెలిపారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 89 ప్రమాదాలు నమోదు కాగా, బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 50 కేసులు నమోదయాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.


