News December 26, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా నూతన కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 26న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని పార్టీ PRO తెలిపారు.

Similar News

News December 28, 2025

వాళ్లు బట్టతల ఉన్నోళ్లకూ దువ్వెన అమ్మగలరు: దిగ్విజయ్

image

అద్వానీ, మోదీ <<18686086>>ఫొటోను<<>> కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ షేర్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలపై దిగ్విజయ్ స్పందించారు. సంఘ్ భావజాలాన్ని వ్యతిరేకిస్తానని, ఆ సంస్థ రాజ్యాంగాన్ని ఫాలో కాదని ఆరోపించారు. RSS కార్యకర్తలు బట్టతల ఉన్న వ్యక్తులకూ దువ్వెనలు అమ్మగలరని ఎద్దేవా చేశారు. వాళ్లు చాలా తెలివైన వాళ్లని, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలా పని చేయాలన్నారు.

News December 28, 2025

కామారెడ్డి: కొత్త ఏడాదిలో కొత్త వ్యూహాలతో ముందుకు: SP

image

రానున్న సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రజలందరికీ శాంతిభద్రతలతో కూడిన సురక్షితమైన సమాజాన్ని అందించడమే తమ ప్రాధాన్యత అని ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ వివరించారు.

News December 28, 2025

NZB: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ టౌన్ ఎస్‌హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతల ఏడ్డి రాజన్న(50) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.