News October 16, 2025

సిరిసిల్ల: ‘కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి’

image

రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు, పెద్దబోనాల, సర్దాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మెప్మా ఆధ్వర్యంలో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 17% శాతం తేమ ఉండేలా చూసుకుని కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలన్నారు. ఏఎంసీ చైర్ పర్సన్ స్వరూప ఉన్నారు.

Similar News

News October 17, 2025

దీపావళి రోజు ఏం చేయాలంటే?

image

దీపావళి ముందురోజే ఇంటిల్లిపాది నూనెతో అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘పండుగరోజు ఉదయమూ తలస్నానం చేయాలి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీపావళికి తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేయాలి. దీపాలు వెలిగించి, అమ్మవారికి షడ్రుచులతో వంటకాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక ఆ దీపాలను ఇంటి ముందు, తులసి కోట వద్ద అలంకరించుకోవాలి’ అని చెబుతున్నారు.

News October 17, 2025

HUDCOలో 79 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) 79 మేనేజర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ/బీటెక్, CA/CMA, LLB, LLM, MBA, PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hudco.org.in/

News October 17, 2025

HYD: ఏపీ మహిళపై అత్యాచారం చేసింది ఇతడే

image

రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకన్నారు. పల్నాడులోని సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.