News January 31, 2025
సిరిసిల్ల: కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి: ఎన్నికల అధికారి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలుచేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్‌తో శుక్రవారం మాట్లాడారు. పట్టభద్రుల, టీచర్ల ఓటర్ నమోదు పెండింగ్ దరఖాస్తులను ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రాజకీయ పార్టీల హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు తొలగించాలన్నారు.
Similar News
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి రద్దీ: సింహాచలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు కొండపైకి ద్విచక్ర వాహనాలను నిలిపివేసి, కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్ విభాగం కోరింది.
News December 30, 2025
జనవరి నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

TG: కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. HYDలో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.
News December 30, 2025
విశాఖ: వడ్డీ లేకుండా పన్నుల చెల్లింపు.. రేపటితో గడువు పూర్తి

2025-26 ఆర్దిక సంవత్సరంనకు(1.10.25 – 31.03.26) వరకు జీవీఎంసీకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను వడ్డీ లేకుండా డిసెంబర్ 31లోగా చెల్లించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. గడువులోగా చెల్లించి వడ్డీ చెల్లింపు మినహాయింపు పొందాలన్నారు. ప్రజల సౌకర్యార్ధం జీవీఎంసీ వెబ్ పోర్టల్ (gvmc.gov.in)లో పన్నులు చెల్లించవచ్చని చెప్పారు.


