News March 29, 2025

సిరిసిల్ల: గడువులోగా పన్ను చెల్లించాలి: సందీప్ ప్రకాష్

image

GST పన్ను చెల్లింపుదారులు ఈనెల 31వ తేదీలోపు పన్ను చెల్లించి రాయితీ పొందాలని జీఎస్టీ, కస్టమ్స్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ సందీప్ ప్రకాష్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం GST అధికారులు సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

image

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

సంగారెడ్డి: ’30లోగా నమోదు చేసుకోవాలి’

image

జిల్లాలోని వ్యవసాయ రైతులు తమ పంటల వివరాలను 30వ తేదీలోగా ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆన్లైన్‌లో నమోదు చేసుకుంటేనే సీసీఐలో అమ్మడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అన్నారు. కావున రైతులందరూ తమ పట్టా పాసు బుక్‌ను తీసుకొని ఆయా మండలాల వ్యవసాయ అధికారులను కలవాలని కోరారు.

News September 14, 2025

భద్రాద్రి జిల్లాలో లోక్ అదాలత్‌.. 4,576 కేసుల పరిష్కారం

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో మొత్తం 4,576 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సివిల్ కేసులు 32, క్రిమినల్ కేసులు 2,023, బ్యాంకు కేసులు 278, ఇల్లందులో సివిల్ కేసులు 12, క్రిమినల్ కేసులు 363, పీఎల్‌సీ కేసుల 132, భద్రాచలంలో క్రిమినల్ కేసులు 1,106, పీఎల్‌సీ కేసులు 74, మణుగూరులో క్రిమినల్ కేసులు 489, పీఎల్‌సీ కేసులు 67 పరిష్కారం అయ్యాయన్నారు.

.