News February 6, 2026

సిరిసిల్ల: ‘గర్భిణీలకు అవగాహన కల్పించాలి’

image

గర్భిణీలకు అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సిరిసిల్లలో అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ నియమాలను ఏఎన్ఎంలకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ.. గర్భిణీలలో రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, మూర్చ రోగం, కామెర్లు, క్షయ వ్యాధి, పిండం మెరుగుదల పరిమితి తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News February 7, 2026

కల్వకుర్తి మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికో..?

image

మున్సిపల్ ఎన్నికల వేళ కల్వకుర్తిలో రాజకీయ వేడి రాజుకుంది. చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి రత్నమాల, బీఆర్ఎస్ నుంచి రాధిక, బీజేపీ నుంచి గుర్రాల జ్యోతి బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. ముగ్గురు మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పట్టణ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

News February 7, 2026

కరీంనగర్: సొంతోడికి పోటు.. పగవాడికీ నోటు!

image

KNRజిల్లాలో ఎన్నికల ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ జరుగుతుందనే ప్రచారం జోరుందుకుంది. ఛైర్మన్, మేయర్ పదవి ఆశావాహులు, ఆర్థికంగా ఉన్నవారు పోటీచేసే వార్డుల్లో వ్యయం రూ.కోటి వరకు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో విచిత్రమేమిటంటే.. సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు అసమ్మతి నేతలే ప్రత్యర్థులకు రహస్యంగా ఫండింగ్ ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.

News February 7, 2026

దేవుని కడపకు పోటెత్తిన భక్తులు

image

తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున నుంచి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.