News March 23, 2025

సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

Similar News

News February 25, 2026

BIG BREAKING: నాగర్‌కర్నూల్ ఘటన.. పోస్టుమార్టం రిపోర్ట్‌ ప్రకటన

image

నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో నేరస్థులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. A1-ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, A2-మధు రెడ్డి, A3-శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. రెండు నెలల చిన్నారి మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్‌లో అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని నివేదిక వచ్చిందని, RFSL రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

News February 25, 2026

కంబాలకొడం అభివృద్ధి కి బృహత్ ప్రణాళిక

image

కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు. పర్యావరణహితంగా పర్యాటక కార్యకలాపాలు రూపకల్పన చేయాలని అటవీ అధికారులు పేర్కొన్నారు.

News February 25, 2026

AC ధరలు హీటెక్కిస్తాయి!

image

ఈ వేసవిలో AC కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ తగ్గడంతో ACల రేట్లు 5 నుంచి 15% పెరుగుతాయని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ చెప్పారు. రాగి టన్నుకు 13 వేల డాలర్లు పలుకుతోంది. దీంతో పాటు కొత్త పవర్ సేవింగ్ రూల్స్ వల్ల ACల తయారీ ఖర్చు భారమైంది. ధరలు పెరిగినా ఈసారి అమ్మకాలు కూడా 20% పెరుగుతాయని ముకుందన్ తెలిపారు.