News January 20, 2026
సిరిసిల్ల: గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు

అధునాతన గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి తెలిపారు. అధునాతన పద్ధతుల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, ఆలయానికి అనుబంధంగా గోశాలల నిర్మాణం తదితర అంశాలపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్ తో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ పాల్గొన్నారు.
Similar News
News March 27, 2026
NGKL: రైతులు ALERT.. ఈనెల 28న ‘కిసాన్ మేళా’

నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంలోని కృషి విజ్ఞానకేంద్రంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ Dr.పి.శ్రీదేవి “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈనెల 28న ఉదయం 9:30 గంటలకు వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై నమూనాల ప్రదర్శన, రైతులు-శాస్త్రవేత్తలకు చర్చా, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామని రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. SHARE IT
News March 27, 2026
కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

కాకతీయ యూనివర్సిటీ సైన్స్, లైఫ్ సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 55 సీట్లు ఖాళీగా ఉండగా ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నెట్/స్లెట్ అర్హతతో పాటు ఎంఎస్సీలో కనీసం 55% మార్కులు అవసరం. ఓసీలకు రూ.1200, ఇతరులకు రూ.800 ఫీజు నిర్ణయించారు.
News March 27, 2026
మార్కాపురం: చికిత్స పొందుతున్న వారి వివరాలివే.. 2/2

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1-16 వివరాలకు <<19486529>>ఇక్కడ క్లిక్<<>>. 17.కిరణ్ (దాసరిపల్లి, వడ్డగిరి), 18.రత్తమ్మ (గుడ్లూరు), 19.చందు, 20.చందన, 21.సురేంద్ర, 22.మనోజ్ కుమార్, 23.మేఘన (వింజమూరు), 24.ప్రకాష్ (ఉదయగిరి), 25.అయ్యన్న (ఎర్రగుంట్ల, కొండాపురం), 26.మనోకర్ రావు జమ్మలమడక, మాచర్ల), 27.ఆమోస (నల్లగుండ్ల) 28.మనీయమ్మ (వల్లిగాటిపల్లి) అని వెల్లడించారు.


