News December 10, 2025
సిరిసిల్ల: ‘గౌరవప్రదమైన జీవితానికి హక్కులే ఆధారం’

ప్రతి మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జె.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాల మేరకు తంగళ్లపల్లిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమం నిర్వహించింది. హక్కులు తెలుసుకొని, ఇతరుల హక్కులను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి సూచించారు.
Similar News
News December 21, 2025
TDP జిల్లా అధ్యక్షులు వీరే! 1/2

AP: TDP జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించారు. * తిరుపతి – పనబాక లక్ష్మి * చిత్తూరు – షణ్ముగ రెడ్డి * అన్నమయ్య – సుగవాసి ప్రసాద్ * ప్రకాశం – ఉగ్ర నరసింహా రెడ్డి * అనంతపురం – పూల నాగరాజు * శ్రీ సత్యసాయి – ఎంఎస్ రాజు * నంద్యాల – గౌరు చరితా రెడ్డి * విజయనగరం – కిమిడి నాగార్జున * ఏలూరు – బడేటి రాధాకృష్ణ * కాకినాడ – జ్యోతుల నవీన్ * బాపట్ల – సలగల రాజశేఖర్ * పల్నాడు – షేక్ జానే సైదా
News December 21, 2025
శ్రీ సత్యసాయి: ఒకే నేతకు నాలుగు పదవులు

TDPలో మడకశిర MLA MS రాజుకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయనకు 4 కీలక పదవులు దక్కాయి. ఇప్పటికే మడకశిర MLAగా, TTD బోర్డు సభ్యుడిగా, TDP రాష్ట్ర SC సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను తాజాగా సత్యసాయి జిల్లా TDP అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. యువగళం పాదయాత్ర నుంచి పార్టీ బలోపేతానికి చేసిన సేవలకే ఈ గుర్తింపు లభించిందని మద్దతుదారులు చెబుతున్నారు.
News December 21, 2025
కలుపుతో అపరాల పంట దిగుబడికి ముప్పు

అపరాల పంటల్లో మినుము, పెసర, కంది, శనగ ముఖ్యమైనవి. అపరాల పైర్ల తొలిదశలో పెరుగుదల నెమ్మదిగా ఉన్నందున కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మినుము, పెసర, శనగ పైర్లలో తొలి 35-40 రోజులు, కందిలో తొలి 75-80 రోజులు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత సాళ్ల మధ్య ఖాళీ లేకుండా పైరు కమ్ముకొని పెరగడం వల్ల కలుపు పెరగదు. కలుపు నివారణలో నిర్లక్ష్యం వహిస్తే అపరాల పంట దిగుబడి 50-75% వరకు తగ్గే అవకాశం ఉంటుంది.


