News February 23, 2026
సిరిసిల్ల గ్రీవెన్స్ డేలో 27 ఫిర్యాదులు

బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News February 24, 2026
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కీలక బాధ్యత

భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్‌గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం. కమిటీలో రంజన్ గొగోయ్, రణదీప్ సుర్జేవాలా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.
News February 24, 2026
ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News February 24, 2026
మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.


