News December 23, 2025
సిరిసిల్ల : చలాన్ల ద్వారా రూ.4.28 కోట్ల జరిమానా

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసులు, వాహనాలకు ఈ చలాన్ల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు 4.28 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి గితే వెల్లడించారు. 2025లో 12,151 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 1,91,756 ఈ చలాన్ల ద్వారా 4 కోట్ల 28 లక్షల 3 వేల 95 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 24, 2025
ఐ పోలవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంపచోడవరం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువకులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 24, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in
News December 24, 2025
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేయాలి: కలెక్టర్

పర్యాటక రంగ అభివృద్ధిలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో హోమ్‌స్టేలు, కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్, పర్యాటక ఈవెంట్లు, ట్యాక్సీ యాప్‌లపై చర్చించారు. హోమ్‌స్టేలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ ప్రోత్సహించాలన్నారు. పర్యాటక సమాచారం అందుబాటులో ఉండే ట్యాక్సీ యాప్, బ్రోచర్లు ఉంచాలని సూచించారు.


