News January 24, 2026

సిరిసిల్ల: ‘చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం’

image

వాహనదారులు చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్పీ మహేశ్ బి.గితే అన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ‘Arrive-Alive’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డుపై పోలీసులు ఉన్నా, లేకున్నా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రమాదాల సమాచారం అందించాలని తెలిపారు. వాహనాలకు ప్రమాదాల నివారణ సూచనల స్టిక్కర్లు అతికించారు.

Similar News

News April 13, 2026

పరిశ్రమల స్థాపనకు ‘వరంగల్‌’ సిద్ధం!

image

HNK, జనగామ, వరంగల్ సెజ్‌లలో 16.82 లక్షల చ.మీ. విస్తీర్ణంలో 632 ప్లాట్లు సిద్ధంగా ఉన్నట్లు TGIIC వెల్లడించింది. చదరపు మీటరు ధరను రూ.1,325 నుంచి రూ.4,215 వరకు నిర్ణయించారు. అత్యధికంగా వరంగల్‌లో 11.25 లక్షల చ.మీ. స్థలం అందుబాటులో ఉండగా.. ఇక్కడ స్క్వేర్ మీటర్ ధర రూ. 1325 నుంచి రూ.2016గా ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే వీలుంది.

News April 13, 2026

అనకాపల్లి: నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

image

విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ తేజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30- 1:30 గంటల వరకు నం.8688400499కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అనకాపల్లి, విశాఖ,అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 13, 2026

పెరిగిన క్రూడాయిల్ ధరలు!

image

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 8.36% ఎగసి 103 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద కొనసాగుతున్నాయి. యురోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓ దశలో 18% పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు <<19635574>>నిలిపేస్తామని<<>> US హెచ్చరించడంతో క్రూడ్ ధరలు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.